![]() |
![]() |

బర్దస్త్ లో బులెట్ భాస్కర్ టీమ్ అంటే చాలు ఆడియన్స్ పడీపడీ నవ్వుతారు. ఎందుకంటే ఆ టీమ్ లో పటాస్ ఫైమా, నాటీ నరేష్ ఉంటారు. వీళ్ళ టీమ్ చేసే స్కిట్స్ తో ఫుల్ ఎంటర్టైన్ అవ్వొచ్చు. అందుకే జడ్జ్ ఖుష్బూకి కూడా వీళ్ళ టీమ్ మీద స్పెషల్ ఇంటరెస్ట్ ఉంటుంది. ఇక ఒక చిట్ చాట్ సందర్భంగా బులెట్ భాస్కర్ కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇలా చెప్పుకొచ్చాడు."కాలేజీ చదివేటప్పుడు నా పర్సనాలిటీని చూసి అందరూ రౌడీని అనుకునేవాళ్లు కానీ అలా ఉండేవాడిని కాదు. ఇంద్రజ గారు, ఖుష్బూ గారు ఇద్దరూ పెద్ద లెజెండ్స్..
ఇద్దరిలో కూల్ ఎవరు, హాట్ ఎవరు అని చెప్పమంటే చాలా కష్టం. ఇంద్రజ గారు హాట్, ఖుష్బూ గారు కూల్ ఎప్పుడు ఇలా ఉంటారంటే సెట్ బాయ్స్ ఎవరైనా అరిచినప్పుడు...మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే మూవీకి ఒక వారం రోజుల పాటు ట్రాక్ చెప్పాను. మూవీస్ లోకి ఇంకా వెళ్లకపోవడానికి కారణం ఏంటంటే జబర్దస్త్ లో మిగతా ఈవెంట్స్ లో ఫుల్ బిజీ టీమ్ మాది. ముందు డబ్బులు సంపాదించి పక్కన పెట్టుకున్నాక అప్పుడు సినిమాల్లోకి వెళదామని ఆగా. నాకు హైదరాబాద్ అంటేనే భయం. వైజాగ్ లో మంచి శాలరీతో జాబ్ చేసుకునేవాడిని. ఎక్కువగా జీతం ఇస్తామని చెప్పినా హైదరాబాద్ వెళ్ళలేదు. కానీ దేవుడు ఇదంతా చేసాడు. హైదరాబాద్ కి తీసుకొచ్చాడు. దాంతో టీవీలోకి వచ్చాము..రేపు సినిమాల్లోకి వెళ్తాం.. అంతా ఆ దేవుడి మాయ. " అంటూ చెప్పుకొచ్చాడు బులెట్ భాస్కర్.. బులెట్ భాస్కర్ తానూ చేసే ప్రతీ ఈవెంట్ లో ఎవరు ఉన్నా లేకపోయినా నాటీ నరేష్ ఉండాల్సిందే. వీళ్ళ ఫ్రెండ్ షిప్ అలాంటిది.
![]() |
![]() |